W.G: అభివృద్ధి పనుల్లో ఎటువంటి అలసత్వం వహించకుండా పనులు పూర్తి చేయాలని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. పెద అమిరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో పాలకోడేరు మండల నాయకులతో గ్రామాలోని అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. పాలకోడేరులో చేపడుతున్న పనులు, చేపట్టాల్సిన పనులపై నాయకులతో ఆయన చర్చించారు.