ELR: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీసీహెచ్ఎస్ పాల్ సతీశ్ మంగళవారం తెలిపారు. జిల్లాలో సుమారు 2 లక్షల మంది చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీని నిమిత్తం 1,709 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కావున జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.