ములుగు మండలం కన్నాయిగూడెం గ్రామ సర్పంచ్‌గా అజ్మీర శారద విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 58 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ జీపీ ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. ప్రతిసారి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే ఈ గ్రామంలో ఈసారి ఎన్నికలు జరగగా ఏ పార్టీ మద్దతు లేకుండా అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. దీంతో ఆమె మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.