AP: కోటి సంతకాలంటూ వైసీపీ నేతలు నాటకాలు మొదలుపెట్టారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. వైసీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేయలేదన్నారు. జగన్కు రుషికొండపై ఉన్న శ్రద్ధ.. మెడికల్ కాలేజీలపై లేదన్నారు. 2019-24లో రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్లారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ఉందని చెప్పారు.