VZM: బొబ్బిలి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ స్దానిక ఎమ్మెల్యే బేబినాయనను ఇవాళ కలసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. మరణించిన పారిశుద్ద్య కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆరు నెలలుగా కమిషనర్‌ను కోరినప్పటికి పట్టించుకోవడం లేదని వాపోయారు. పారిశుద్ద్య కార్మిక కుటుంబాలకు ఉద్యోగాలు , యూనిఫామ్ ఇప్పించాలని కోరారు.