ATP: ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఈబీ.దేవి తెలిపారు. అనంతపురంలోని కార్యాలయంలో మంగళవారం పల్స్ పోలియో వాల్ పోస్టర్ను ఆమె విడుదల చేశారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని సూచించారు.