NLR: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 21వ తేదీ ఆదివారం నిర్వహించనున్న పోలియో దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎమ్. శ్రీలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులతో కలిసి కార్యక్రమం గోడపత్రికను బుధవారం ఆవిష్కరించారు.