వరంగల్ పట్టణ కేంద్రంలోని MGM ఆస్పత్రిలో మరోసారి భద్రతా లోపాలు బయటపడ్డాయి. గతంలో ఎలుకలు కొరికిన వార్డులోకి తాజాగా ఒక కుక్క ప్రవేశించడంతో రోగులు, బంధువుల్లో ఆందోళన వ్యక్తమైంది. రోగి బంధువులు ఈ ఘటనను వీడియో తీసి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విధుల్లోని ఇద్దరు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.