పార్లమెంట్ సమావేశాలు ఈనెల 19తో ముగుస్తుండటంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. లోక్సభలో తమ ఎంపీలందరికీ విప్ జారీ చేసింది. చివరి మూడు రోజులు కచ్చితంగా సభకు హాజరుకావాలని ఆదేశించింది. కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు బీజేపీ కూడా ఇప్పటికే ఎన్డీయే ఎంపీలకు విప్ జారీ చేసిన విషయం తెలిసిందే.