ELR: చాట్రాయి మండలం సూరంపాలెంలో గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్న కోడి కత్తులను స్వాధీనం చేసుకుని, తయారీదారుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశంతో, విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన దాడిలో 750 కోడి కత్తులతో పాటు వాటి తయారీకి వినియోగించిన మోటార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.