VZM: తెర్లాం మండలం, బూరిపేట గ్రామంలో నూతన పాఠశాల భవన నిర్మాణం కోసం బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన బుధవారం స్థలాన్ని పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పాఠశాల నిర్మాణానికి ఎస్టిమేటు తయారుచేయించి వీలైనంత త్వరలో నిర్మాణాన్ని చేపట్టేలా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు పాల్గొన్నారు.