ELR: అంగన్వాడీ కార్యకర్తలు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు 5జి స్మార్ట్ ఫోన్లను అందజేస్తోందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే స్వయంగా 5జి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు.