NGKL: చారకొండ మండలం ఎర్రవల్లి-గోకారం రిజర్వాయర్ నిర్వాసితుల నిరసనలు ఉద్ధృతమవుతున్నాయి. తమ ఇళ్లు, భూములు ముంపునకు గురికాకుండా రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా గ్రామస్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 16వ రోజుకు చేరాయి. పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.