JGL: జగిత్యాల జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ఇబ్రహీంనగర్, గొల్లపల్లి, బత్కపల్లి, నంచర్ల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ తెలిపారు.