ELR: రానున్న రబీ సీజన్లో సాగునీటికి, వేసవిలో తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ పాల్గొన్నారు.