AKP: రెవిన్యూ డివిజన్ అంశాన్ని రాజకీయం చేయవద్దని వైసీపీ నాయకులకు రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం మునగపాక మండలం తిమ్మరాజుపేటలో మాట్లాడుతూ.. మండల ప్రజల మనోభావాలను గుర్తించిన కూటమి ఎమ్మెల్యేలు విజయ్ కుమార్, కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ తదితరులు అనకాపల్లిలోనే కొనసాగించాలని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.