KRNL: వెల్దుర్తిలో సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. కార్మిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రమాదాలు, వృద్ధాప్యంలో కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమ బోర్డు అవసరమని తెలిపారు.