SKLM: హిరమండలంలో పోలియో నిర్మూలనకు ప్రతి పిల్లాడికి పోలియో చుక్కలు వేయాలని హిరమండల పీహెచ్సీ వైద్యులు గౌతమి, సాయికుమార్ తెలిపారు. మంగళవారం ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలతో పల్స్ పోలియోపై సమావేశం నిర్వహించారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో కార్యక్రమం జరుగుతుందని, అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు.