VSP: విశాఖను దేశంలోనే ఉత్తమ పోలీసింగ్ నగరంగా, ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన పోలీసు అధికారులతో భేటీ అయ్యారు. 2026 నుంచి ఏఐ ట్రాఫిక్, మహిళలు–పిల్లల భద్రత, సైబర్ అవగాహన, డ్రగ్ విముక్తిపై చర్యలు చేపడతామని చెప్పారు.