MDK: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ తూప్రాన్ డీఈ గరత్మంత్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో ప్రజా బాట కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు డీఈ తెలిపారు. ఏడీఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.