కృష్ణా: హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌పై నూతన గ్లోసైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. విశ్వహిందు పరిషత్ జాతీయ ట్రస్టీ పుట్టగుంట సతీష్ కుమార్ మరోసారి స్పందించి ఈ బోర్డులను అందజేశారు. 2012లో ఏర్పాటు చేసిన పాత గ్లోసైన్ బోర్డులు కాలక్రమేణా వెలిసిపోయి శిథిలావస్థకు చేరడంతో, కొత్త బోర్డులు ఏర్పాటు చేయాలని జంక్షన్ ఎస్సై వి.సురేష్ ఆయనను కోరారు.