E.G: గోకవరం(M) కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO డా.కే.వెంకటేశ్వరరావు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి-1, కొత్తపల్లి-2 హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లను ఆయన సందర్శించి, ఎం.ఎల్.హెచ్.పీ.లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించిన DMHO, వెల్నెస్ సెంటర్లు పనివేళల్లో తప్పనిసరిగా తెరిచి ఉంచాలని ఆదేశించారు.