VZM: ప్రతీ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ సెల్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి సూచించారు.దీని వలన అర్జీదారులు తాము ఇచ్చిన అర్జీపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొనే అవకాశం ఉంటుందన్నారు. పీజీఆర్ఎస్ వినతులపై కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆయన బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.