ATP: జిల్లా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో 24 కొనుగోళ్లు కేంద్రాల ద్వారా 412 మంది రైతుల నుంచి రూ.12.62 కోట్ల విలువైన 4,951 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ శివ నారాయణశర్మ తెలిపారు. ఇప్పటివరకు 185 మంది రైతులకు రూ.5.71 కోట్లు చెల్లించామని అన్నారు. మిగిలిన రూ. 6.91 కోట్ల చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.