WG: తాడేపల్లిగూడెం పట్టణం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డుగా పని చేస్తున్న ఎస్.రమణకు పోలీస్ సేవా పతకం లభించింది. ఈమేరకు భీమవరంలో స్పెషల్ గ్రే హ్యాండ్ ఎస్పీ చేతుల మీదుగా అందచేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రశంసా పత్రం కూడా అందించారు. ఈ హోం గార్డు రమణను పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందించారు.