MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామ సర్పంచ్ బండారి శ్రీనివాస్ గౌడ్ సోమవారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై ఘన విజయం సాధించి తన తల్లి అంజమ్మతో కలిసి మాజీ ఎమ్మెల్యేను కలిశారు. గ్రామ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.