MNCL: లక్షెట్టిపేట తాలూకాతో పాటు వివిధ మండలాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 20న ఆయా మండలాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నూతన సర్పంచులు వార్డు సభ్యులతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించనున్నామని అధికారులు వెల్లడించారు.