EG: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ సోమవారం బైక్ ర్యాలీ చేపట్టింది. మాజీ హోం మంత్రి తానేటి వనిత నేతృత్వంలో వైసీపీ శ్రేణులు దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్దకు భారీగా తరలివెళ్లారు. మాజీ సొసైటీ అధ్యక్షుడు గుత్తికొండ అచ్చుతారావు, యువజన విభాగ నాయకులు అనిశెట్టి సూర్యచంద్రం కార్యకర్తలతో కలిసి బొమ్మూరులోని వైకాపా కార్యాలయానికి చేరుకున్నారు.