AP: కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఒక్క పథకం కూడా అమలు చేయలేదని విమర్శించారు. ‘కేవలం ఏపీని అమ్మడానికి పెట్టడమే చంద్రబాబు పథకం. మెడికల్ కాలేజీలు ప్రైవేటీపరం చేయాలని పార్లమెంటరీ స్థాయి సంఘం ఎక్కడా చెప్పలేదు. 350 ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రైవేట్‌పరం చేసే కుట్ర ఇలాంటి అడ్డగోలు దోపిడీ ప్రపంచంలో ఎక్కడా లేదు’ అని మండిపడ్డారు.