TG: మెదక్ జిల్లాలోని చీపురు దుబ్బతండా సర్పంచ్ ఫలితాలను అధికారులు డ్రాతో తేల్చారు. ఈ డ్రాలో కాంగ్రెస్ మద్దతుదారు కేతవత్ సునీతను అదృష్టం వరించింది. ఎన్నికల్లో కేతవత్ సునీత, బీఆర్ఎస్ మద్దతుదారు బీమిలికి చెరో 182 ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ ఓట్లు సమానంగా రావడంతో ఆర్వో వెంకటయ్య డ్రా తీశారు.