AP: రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థ రానుంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)ను అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. వ్యూహాత్మక కారణాలతో విశాఖ సముద్రతీరంలో బార్క్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందు కోసం భూమి కేటాయించాలని బార్క్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.