MBNR: గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ డీ.జానకి స్పష్టం చేశారు. బైక్ ర్యాలీలు, సభలు, శోభాయాత్రలు, డీజే కార్యక్రమాలు వంటి ఎలాంటి ఉత్సవాలు నిర్వహించవద్దని ఆదేశించారు. మూడు విడతల పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని ఆమె కోరారు.