NLR: దగదర్తి మండలం ఉలవపాళ్ల క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఆగి ఉన్న కంటైనర్ లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దగదర్తి ఎస్సై జంపాని కుమార్ అతడిని హైవే అంబులెన్సులో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బైక్ నంబర్‌ను బట్టి ఉలవపాడు మండలం, పెద్ద పట్టపుపాలెం గ్రామానికి చెందిన రామారావుగా గుర్తించారు.