SKLM: టెక్కలి ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరు కానున్నట్లు DRO లక్ష్మణ మూర్తి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి వినతులు స్వీకరిస్తారని తెలిపారు. అలాగే ప్రజలు తమ అర్జీలను మీకోసం వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చన్నారు.