అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ టాస్ మరింత ఆలస్యం కానుంది. గ్రూప్ Aలో చెరో మ్యాచ్ గెలిచిన ఇరుజట్లు.. ఇవాళ విజయం సాధించి టోర్నీ సూపర్-4 బెర్త్‌ను ఖాయం చేసుకోవాలనే యోచనలో ఉన్నాయి.