ADB: స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుందని ఆ పార్టీ బోథ్ నియోజకవర్గం ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం సిరికొండ మండలంలో పర్యటించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంతో వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.