KRNL: ఆలూరులో ఆదివారం టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్‌ను ఆస్పరి మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రామలింగప్ప, సంజప్ప, రంగనాథ్ సహా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆస్పరి మేజర్ పంచాయతీ స్థానిక బస్టాండ్ నుంచి ఆలూరు రోడ్డు వరకు ప్రధాన రహదారి సీసీ రోడ్డు నిర్మించాలని ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకువచ్చారు.