TG: ఓట్ చోరీ సమస్య కాంగ్రెస్‌దే కాదని.. దేశానిదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఓటు హక్కు నుంచి పేదలను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటు తొలగిస్తే రేషన్ కార్డు, భూమి సహా అన్నీ కోల్పోతారని చెప్పారు. ఓటు చోరీ అంశంపై రాహుల్ సైనికుడిలా పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిఒక్కరూ రాహుల్‌కు మద్దతుగా నిలబడాలని కోరారు.