TG: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మల్లయ్య కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కవ్విస్తోందన్నారు. ఎంత కవ్వించినా హింసకు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్పడవద్దని సూచించారు.