AP: నంద్యాల జిల్లా అవుకు జలాశయాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రివిట్మెంట్ మరమ్మతు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల్లో లీకేజీలకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిధులు సరిపోకపోతే ప్రభుత్వంతో మాట్లాడి అదనపు నిధులు తీసుకొస్తామని తెలిపారు. పనుల నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు.