TG: రంగారెడ్డి జిల్లా ఆలూరు పోలింగ్ కేంద్రం వద్ద విషాదం నెలకొంది. ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే బుచ్చయ్య(70) కుప్పకూలాడు. అనంతరం అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆస్పత్రికి తరలించేలోపే మరణించినట్లు ధృవీకరించారు. కాగా బుచ్చయ్య కుమార్తె రాములమ్మ వార్డు సభ్యురాలిగా పోటీ చేసింది.