AP: ప్రస్తుత ప్రపంచం విభజన, అనిశ్చితి సమస్యలను ఎదుర్కొంటోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. శాంతి సాధనకు భారత్ పోషించే పాత్ర కీలకమని పేర్కొన్నారు. మన దేశం నిరంతరం శాంతి సందేశాన్ని వినిపిస్తూనే వస్తోందని తెలిపారు. శాంతి అంటే కేవలం ఘర్షణలకు, యుద్ధానికి వెళ్లకుండా ఉండడమే కాదన్నారు. ఇతరులను పరస్పరం గౌరవించడం, బాధ్యతలు తీసుకుని సహకారాన్ని అందించడం కూడా భాగమేనని చెప్పారు.