TG: రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 22.54% పోలింగ్ నమోదైంది. నల్గొండలో 28.15%, సూర్యాపేటలో 25.97% ఓటింగ్ జరిగింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్లలోనూ 20% పైగా పోలింగ్ నమోదైంది. అయితే వనపర్తి జిల్లా చిమనగుంటపల్లి 8వ వార్డులో పోలింగ్ నిలిచిపోవడం గమనార్హం.