PPM: కురుపాం మండలంలో జాయింట్ కలెక్టర్ మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కురుపాం మండలం మొండెంఖల్లు గ్రామంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను జేసీ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి విద్యార్థుల విద్యా ప్రమాణాలు, బోధనా విధానాలు, విద్యార్థుల హాజరు, భోజన నాణ్యత, వసతి సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. తరగతుల్లో బోధన విధానాన్ని పరిశీలించారు.