పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్ వేళ శ్రీలంకకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ చరిత్ అసలంక, ఫాస్ట్ బౌలర్ ఫెర్నాండో ఈ టోర్నీకి దూరమయ్యారు. తాజాగా స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ విజయకాంత్‌ను జట్టులోకి తీసుకుంది. అతడిని స్వదేశంలో భవిష్యత్ హసరంగగా కీర్తిస్తుంటారు.