VZM: పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ముందంజలో నిలవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన విద్యాశాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తక్కువ ప్రతిభ చూపుతున్న విద్యార్థులను గుర్తించి అదనపు బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు మించి ర్యాంకులు సాధించాల్సిన అవసరం ఉందన్నారు.