VZM: నషా ముక్త్ భారత్ అభియాన్ ఐదేళ్లు పూర్తి అయిన సందర్భంగా విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో మత్తుపదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఇందులో భాగంగా అధికారులు, విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. సీఐలు లక్ష్మణరావు, ధనుంజయ నాయుడు మాట్లాడుతూ.. మత్తు పదార్ధాల వినియోగానికి యువత దూరంగా ఉండాలన్నారు.