ELR: జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో మంగళవారం ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని కొందరు అధికారుల పని తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా అధికారులు నిర్లక్ష్య ధోరణితో ఉన్నారని ఫైర్ అయ్యారు. పార్లమెంటు పరిధిలోని సమస్యలపై ప్రతి ఒక్క అధికారి దృష్టి పెట్టి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.