ADB: ఆదివాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉట్నూర్ ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీవో యువరాజ్‌ను టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ కోరారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో ఇన్ఛార్జ్ పీవోను మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.