VZM: భూసేకరణ కేసుల్లో పూర్తి డేటా సిద్ధం చేసి, ప్రజాభ్యంతరాలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. రోడ్డు ప్రాజెక్టులు, రైల్వే మూడవ, నాలుగవ లైన్ భూసేకరణను వేగవంతం చేయాలని, పారిశ్రామిక పార్కుల్లో కొత్త యూనిట్ల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలన్నారు.